ETV Bharat / state

HMDA Auction Shabad Lands In Rangareddy : షాబాద్​లోని ప్లాట్ల ఈ-వేలం.. ఏకంగా రూ.33.06 కోట్ల ఆదాయం - మోకిల్ల భూములు ఈ వేలం

HMDA Auction Shabad Lands In Rangareddy : హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భూముల వేలం కొనసాగుతోంది. కోకాపేట, మోకిల్ల తర్వాత ఇవాళ రంగారెడ్డి జిల్లా షాబాద్ లోని ప్లాట్లను విక్రయించారు. షాబాద్​లో వంద ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ ను ప్రతిపాదించిన హెచ్ఎండీఏ.. ఇవాళ 50 ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించింది. 300 చదరపు గజాల చొప్పున విస్తీర్ణం ఉన్న 15వేల చదరపు గజాల విస్తీర్ణంతో 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భావించారు.దీంతో 50 ప్లాట్ల విక్రయంతో రూ. 33.06 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.

HMDA Auction Shabad Lands In Rangareddy
HMDA Auction Shabad Lands
author img

By

Published : Aug 8, 2023, 10:50 PM IST

HMDA Auction Shabad Lands In Rangareddy : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా​లోని భూములు కోట్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో భూముల వేలం కొనసాగుతోంది. కోకాపేట, మోకిల్ల తర్వాత నేడు రంగారెడ్డి జిల్లా షాబాద్​లోని ప్లాట్లను విక్రయించారు. ఈ షాబాద్​ ప్రాంతంలో వంద ఎకరాల విస్తీర్ణంలోని లే అవుట్​ను హెచ్​ఎండీఏ ప్రతిపాదించింది.

ఇవాళ 50 ఓపెన్​ ప్లాట్లను ఈ-వేలం(e-auction) ద్వారా విక్రయించింది. 300 చదరపు గజాల చొప్పున విస్తీర్ణం ఉన్న 15 వేల చదరపు గజాల విస్తీర్ణంతో రూ.15 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. అయితే చదరపు గజానికి అప్ సెట్ ధరను పదివేల రూపాయలుగా నిర్ధారించగా.. ఈ-వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.27 వేలు.. కనిష్ఠందా రూ.18 వేలు పలికింది. ఇక్కడ సగటున చదరపు గజం రూ.22,040లకు అమ్ముడైపోయింది. దీంతో 50 ప్లాట్ల విక్రయంతో రూ.33 కోట్ల 6 లక్షలు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.

ఆదరణ అదిరింది... హెచ్​ఎండీఏకు భారీగా ఆదాయం

Kokapet Lands Auction 2023 : మరోవైపు గతవారం కోకాపేట (Kokapeta) నియోపొలిస్​ ఫేజ్​-2లోని భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ కోకాపేటలోని 45.33 ఎకరాల భూమికి వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.3,319.60 కోట్లు భారీగా ఆదాయం సమకూరింది. ఇక్కడ వేలంలో ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లు పలుకగా.. అత్యల్పంగా ఎకరా భూమి రూ.67.25 కోట్లకు అమ్ముడైపోయింది.

కోకాపేట ప్రాంతంలో సగటున ఎకరానికి రూ.73.23 కోట్లు ధర పలికింది. 45.33 ఎకరాలకు హెచ్​ఎండీఏ(HMDA) ఈ-వేలం నిర్వహించింది. ఈ-వేలంలో కనీస నిర్దేశిత ధర ఎకరానికి రూ.35 కోట్లు కాగా.. పదో నంబర్​ ప్లాట్​కు గరిష్ఠంగా రూ.100 కోట్లుకు పైగా ధర పలికిందని అధికారులు వెల్లడించారు. అలాగే మరికొన్ని ప్లాట్లకు రూ.72 కోట్లకు పైగా కూడా ధర పలికిందన్నారు.

Budwel layout auction Hyderabad : హాట్ కేకుల్లా భూముల అమ్మకం..సర్కారు ఖజానాకు కనకవర్షం.. బుద్వేల్​ లే ఔట్​పే స్పెషల్ ఫోకస్

Kokapet Neopolis land Auction : హైదరాబాద్​లోని కోకాపేట భూములు మరోసారి కోట్లకు పగడలెత్తాయి. నియో పొలిస్‌ భూములకు దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీ పడ్డాయి. నియో పొలిస్‌లో నిర్ధేశిత కనీస ధర ఎకరం 35 కోట్లు నిర్ణయించగా.. అత్యధికంగా ఎకరాకు వంద కోట్లకు పైగా పలకడం గత రికార్డులను తిరగరాసింది. కోకాపేటలో నియోపొలిస్‌ పేరుతో హెచ్‌ఎండీఏ 500 ఎకరాల్లో లేఅవుట్‌ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో రూ.450 కోట్లతో రహదారులతోపాటు తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా ఎకరా రూ.60 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. అదే ఉత్సాహంతో మిగిలిన 45.33 ఎకరాలకు గురువారం ఈ-వేలం నిర్వహించింది.

Kokapet Land Auction : కోట్లు కురిపించిన కోకాపేట నియోపోలీస్‌ భూముల వేలం.. ఎకరానికి ఎంతంటే ?

HMDA LANDS AUCTION: ఆదాయ లక్ష్యం...రూ.5 వేల కోట్లుపైనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.