ETV Bharat / state

NBK on TDP 40 Years: కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట: బాలకృష్ణ

author img

By

Published : Mar 29, 2022, 2:06 PM IST

NBK on 40years TDP: ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న తెలుగుదేశం ప్రస్థానం స్ఫూర్తిదాయకమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

NBK on TDP 40 Years
NBK on TDP 40 Years

Hindupuram MLA NBK on 40years TDP : తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న తెలుగుదేశం ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. కార్యకర్తలే పార్టీకి కంచుకోట అని అభివర్ణించారు. లక్షలమంది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సుల కారణంగానే నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా రెపరెపలాడుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తెదేపా కొత్తశకం లిఖించిందని వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో, పేదల సంక్షేమంలో ‘తెదేపాకు ముందు, తెదేపా తర్వాత’’ అని చూసేలా చేసిందని.., చరిత్రను తిరగరాసిందని బాలయ్య వెల్లడించారు. ఎన్టీఆర్, చంద్రబాబుల పాలనలో సాధించిన ఎన్నెన్నో అద్భుత విజయాలు, అనితర సాధ్యాలు.. తెదేపా వినూత్న పథకాలు దేశానికే దిశానిర్దేశం చేశాయని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయ్యిందన్నారు.

"పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తెదేపా కొత్తశకం లిఖించింది. నాలుగు దశాబ్దాలుగా పసుపుజెండా రెపరెపలాడుతోందంటే..లక్షలమంది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయింది. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది తెదేపానే. ఎత్తిపోతల పథకాలతో అన్నపూర్ణ అయిందంటే తెదేపా ఘనతే. పారిశ్రామికీకరణకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టారు.తెలుగు రాష్ట్రాల ప్రజల మానసపుత్రిక తెలుగుదేశం. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే తెదేపా రథచక్రాలు. తెదేపా ప్రగతిరథానికి కార్యకర్తలే చోదకశక్తులు. 400 ఏళ్లైనా తెదేపా తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుంది.దుష్టశక్తులెన్ని ఆటంకాలు కల్పించినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం.పోరాటమే మన ఊపిరి.. ఎన్టీఆర్‌కు మనం అందించే నివాళి అదే"

- బాలకృష్ణ, హిందూపూర్ ఎమ్మెల్యే.

ఇదీ చదవండి: Preparation Strategy for TSPSC: విశ్లేషించి చదివితే.. విజయం నీదే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.