ETV Bharat / state

కూకట్​పల్లి సీఐకి హిమాచల్​ప్రదేశ్​ సీఎం అభినందనలు - himachal pradesh cm jairam thakur

లాక్​డౌన్​తో భాగ్యనగరంలో చిక్కుకుపోయిన హిమాచల్​ వాసి అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న కూకట్​పల్లి సీఐ లక్ష్మీ నారాయణరెడ్డి అతణ్ని ఆసుపత్రిలో చేర్పించారు. సీఐ దాతృత్వాన్ని హిమాచల్​ ప్రదేశ్​ సీఎం అభినందించారు.

kukatpally ci helped himachal resident
కూకట్​పల్లి సీఐకి హిమాచల్​ప్రదేశ్​ సీఎం అభినందనలు
author img

By

Published : Apr 23, 2020, 7:55 PM IST

Updated : Apr 23, 2020, 8:18 PM IST

హైదరాాబాద్​ కూకట్​పల్లి మెట్రోలో ఆపరేటర్​గా విధులు నిర్వహిస్తోన్న హిమాచల్​ప్రదేశ్​ వాసి లలిత్​కుమార్​ లాక్​డౌన్​ వల్ల ఇక్కడే ఉండిపోయాడు. అతనికి తీవ్ర కడుపునొప్పి రావడం వల్ల అందుబాటులో ఉన్న సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి తన వాహనంలో ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు.

అపెండిక్స్​ ఉందని వైద్యులు చెప్పగా... చికిత్సకు అవసరమైన రూ.20వేలు సాయం చేశారు. లలిత్​ కుమార్​ కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న హిమాచల్​ సీఎం జయరాం ఠాకూర్​ సీఐ లక్ష్మీనారాయణ రెడ్డిని అభినందించారు. ఐపీఎస్​ అధికారిణి స్వాతి లక్రా ట్విటర్​ ద్వారా సీఐపై ప్రశంసలు కురిపించారు.

Last Updated : Apr 23, 2020, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.