Hijras protest in Banjarahills police station: హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హిజ్రాలు ఆందోళన చేశారు. కొన్ని ప్రాంతాలను ఎంచుకుని నకిలీ హిజ్రాలు కూడా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రౌడీలతో తమపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్టేషన్‌లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని ఐపీసీ 353, 306, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని వీటిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: