ETV Bharat / state

మరింత కిక్కెక్కించేందుకు అధికారుల పాట్లు - exice latest updates

రాష్ట్రంలో మద్యం విక్రయాలను పెంచే దిశలో ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. పది నెలల్లో రూ.19 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా... ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎక్కువ విక్రయాలు జరిగేట్లు చూడాలని స్పష్టం చేస్తున్నారు. ప్రాంతాల వారీగా అమ్మకాలను పరిశీలిస్తున్న అధికారులు తక్కువగా ఉన్న ప్రదేశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.

higher
మరింత కిక్కెక్కించేందుకు అధికారుల పాట్లు
author img

By

Published : Feb 1, 2020, 7:47 AM IST

రాష్ట్రంలో 2019- 20 ఆర్థిక ఏడాదిలో గడిచిన పది నెలల్లో రూ.19వేల కోట్లకుపైగా విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. 2018- 19 ఆర్థిక ఏడాదిలో ఇదే పది నెలల్లో రూ.17వేల 300 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే దాదాపు రెండు వేల కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్ముడుపోయింది.

గడిచిన పది నెలల్లో..

గత ఆర్థిక ఏడాదిలో 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి నెల వరకు రూ.20వేల 860 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. 2019- 20 ఆర్థిక ఏడాదిలో గడిచిన పది నెలల్లో రూ.19వేల కోట్లకు పైగా విలువైన అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

హైదరాబాద్​లో అత్యధికం..

ఈ పది నెలల్లో రూ.500 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగిన జిల్లాలను పరిశీలిస్తే హైదరాబాద్‌ రూ.2,334 కోట్లు, రంగారెడ్డి రూ.3,192 కోట్లు, మేడ్చల్‌ రూ.1,595 కోట్లు, వరంగల్‌ అర్బన్‌ రూ.1,182 కోట్లు, ఖమ్మం రూ.996 కోట్లు, కరీంనగర్‌ రూ.980 కోట్లు, ఆదిలాబాద్‌ రూ.546 కోట్లు, మెదక్‌ రూ.688 కోట్లు, మహబూబ్‌నగర్‌ రూ.803 కోట్లు, నల్గొండ రూ.1,309 కోట్లు, సంగారెడ్డి రూ.508 కోట్లు, నిజామాబాద్‌ రూ.752 కోట్ల లెక్కన అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి..

మద్యం అమ్మకాలను మరింత పెంచే దిశలో ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి... కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రాంతాలు, దుకాణాల వారీగా జరిగిన అమ్మకాలను దగ్గర ఉంచుకుని.. ఎందుకు? అక్కడ అమ్మకాలు తక్కువగా జరిగాయన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అక్కడ ఏమైనా అక్రమ మద్యంకాని, నాన్‌డ్యూటీ పెయిడ్‌కాని, విదేశీ అక్రమ మద్యంకాని, నాటుసారాకాని చొరబాటుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

మద్యం అమ్మకాలు మరింతగా..

స్థానిక ఎస్‌హెచ్‌వోలపై ఒత్తిడి పెంచి... మద్యం అమ్మకాలను మరింతగా పెంచాలని సూచిస్తున్నారు. రోజువారీ లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా అమ్మకాలు జరిగిన మద్యం వివరాలను పరిశీలిస్తే... అక్టోబరు వరకు నెలకు రూ.1,500 నుంచి రూ.1,900 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది నవంబరులో రూ.2,430 కోట్లు, డిసెంబరులో రూ.2,046 కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.2,292 కోట్ల అమ్మకాలు జరిగాయి.

రెండు నెలల్లో రూ. 5వేల కోట్లు టార్గెట్..

వేసవి కాలం కూడా మొదలవుతున్నందున ఫిబ్రవరి, మార్చి రెండు నెలల్లో రూ.5వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కింది స్థాయి అధికారులపై ఒత్తిడి పెంచినట్లయితే మరో రూ.1,000 నుంచి రూ.1,500 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా అమ్మకాలు కొనసాగించేందుకు వీలుందని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: 2018-19 వృద్ధి రేటు సవరణ- 6.1శాతానికి తగ్గింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.