Degree Exams 2022 : రాష్ట్రంలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఛాయిస్ పెంచనున్నారు. ఈ మేరకు ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణ తదితరులు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డిగ్రీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల్లో ‘సెక్షన్-బిలో ఏ లేదా బీ రాయండి’ అని కాకుండా.. ‘ఇచ్చిన ప్రశ్నల్లో మీకిష్టమైన వాటికి సమాధానాలు రాయండి’.. అని మార్చాలని నిర్ణయించారు. దానివల్ల విద్యార్థులకు ఛాయిస్ పెరుగుతుందని సమావేశం భావించింది. పరీక్ష సమయం మాత్రం 3 గంటలే ఉంటుంది. డిగ్రీ మొదటి సెమిస్టర్‌కు ఈ నెల 17 వరకే తరగతులు జరుపుతారు. 18 నుంచి 25వ తేదీ వరకు సంసిద్ధత సెలవులు, ప్రయోగ పరీక్షలు(ప్రాక్టికల్స్) నిర్వహిస్తారు. ఈ నెల 28 నుంచి మార్చి 24 వరకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయి.
Degree Exams in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పలు కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నందున మరోసారి సీపీగెట్ కౌన్సెలింగ్ జరపాలని నిర్ణయించారు. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ జరిపారు. అయితే పలుచోట్ల సీట్లు ఖాళీగా ఉన్నాయని, మరోసారి కౌన్సెలింగ్‌కు అవకాశం ఇవ్వాలని ఏబీవీపీ తదితర సంఘాలు విన్నవించాయి. ఈ క్రమంలో త్వరలో మరోసారి కౌన్సెలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: