ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలోని నిబంధనను సవాల్ చేస్తూ విద్యానగర్ కు చెందిన శ్రీధర్ బాబు రవి, టోలిచౌకికి చెందిన మహమ్మద్ తాహెర్ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇద్దరికి మించి సంతానం ఉన్న వారు రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో పోటీ చేసే విధంగా చట్ట సవరణలు చేసిందని... కానీ జీహెచ్ఎంసీలో మాత్రం అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది రవిచందర్ వాదించారు. స్పందించిన ధర్మాసనం ఈనెల 17లోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: ఉద్రిక్తతకు దారితీసిన కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి