రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలన్న పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. జులై 15 వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్... ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రార్థనా మందిరాలను తెరవడం వల్ల కరోనా తీవ్రత పెరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేశారన్న ఉన్నత న్యాయస్థానం... కరోనా పరిస్థితుల్లో ప్రార్థనా మందిరాలకు వెళ్లాలా? వద్దా? అనేది ప్రజల ఇష్టమని తేల్చింది.
ఇవీ చూడండి: తెలంగాణకు నాలుగు కేంద్ర బృందాలు... ఎందుకంటే?