ETV Bharat / state

'ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి' - సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి

ఉద్యాన పంట సాగులో ఆధునిక పద్ధతులు అవలంభించినట్లైతే చీడపీడలు లేకుండా మొక్కలు దృఢంగా పెరిగి 40 శాతం అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అన్నారు.

ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
author img

By

Published : Aug 6, 2019, 5:09 AM IST

Updated : Aug 6, 2019, 8:10 AM IST

రాయితీపై నారు కావాల్సిన రైతులు ఒక మొక్కకు 10 పైసల చొప్పున చెల్లించి కావాల్సిన నారు బుక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​ శివారు జీడిమెట్లలోని సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​ (సీఓఈ)ని సందర్శించారు. హైటెక్ పద్ధతిలో, నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో పెంచుతున్న కూరగాయల నారును పరిశీలించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న ఆర్కిడ్ పూల పంట, యాజమాన్య పద్ధతుల దిగుబడి, లాభాలపై ఆరా తీశారు. నిట్టనిలువుగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసే పద్ధతి పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. కోరమాండల్ ఇంటర్నేషనల్, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో న్యూట్రి క్లినిక్ ద్వారా భూసార పరీక్షలు చేస్తున్న ల్యాబ్ సందర్శించారు. న్యూట్రి క్లినిక్ సేవలను కేవలం 100 రూపాయలకే ఒక్కో నమూనా పరీక్షించి ఇచ్చే విధానాన్ని మంత్రి అభినందించారు.

ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి

ఇదీ చూడండి:'ఆర్టికల్ 370రద్దు'పై రాజ్యసభలో చర్చ ప్రత్యక్షప్రసారం

Last Updated : Aug 6, 2019, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.