రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం పది గంటల నుంచే భానుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. నేడు రోహిణి కార్తె ప్రారంభంకావడం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో 43, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 47 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు వారాల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ప్రకటించింది. జూన్ 8న రావాల్సిన నైరుతి రుతుపవనాలు మరో ఐదు రోజులు ఆలస్యంగా వస్తాయని వెల్లడించింది.
తెలంగాణలో జిల్లాల ఉష్ణోగ్రతలు ఇలా...
- ఆదిలాబాద్ 45.1°
- కుమురం భీం 42.7°
- మంచిర్యాల 42.4°
- నిర్మల్ 45.4°
- నిజామాబాద్ 44.8°
- జగిత్యాల 44.5°
- పెద్దపల్లి 42.4°
- భూపాలపల్లి 41.8°
- భద్రాద్రి కొత్తగూడెం 40.5°
- మహబూబాబాద్ 41.4°
- వరంగల్ గ్రామీణం 42.6°
- వరంగల్ అర్బన్ 41.8°
- కరీంనగర్ 43.4°
- రాజన్న సిరిసిల్ల 43.7°
- కామారెడ్డి 43.8°
- సంగారెడ్డి 43.8°
- మెదక్ 42.5°
- సిద్దిపేట 42.9°
- జనగామ 41.0°
- యాదాద్రి భువనగిరి 42.5°
- మేడ్చల్ మల్కాజ్‌గిరి 42.2°
- హైదరాబాద్ 42.7°
- రంగారెడ్డి 42.3°
- వికారాబాద్ 41.1°
- మహబూబ్‌నగర్ 41.5°
- జోగులాంబ గద్వాల 39.9°
- వనపర్తి 40.0°
- నాగర్‌కర్నూల్ 42.1°
- నల్గొండ 42.5°
- సూర్యాపేట 41.7°
- ఖమ్మం 41.5°
- ములుగు 40.9°
- నారాయణపేట 42.1°
ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు