HC on Gurukul TGT posts: గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థుల అర్హత వివాదంపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
బీఈడీ చేసిన బీటెక్ అభ్యర్థులు టీజీటీ పోస్టులకు అర్హులేనన్న హైకోర్టు.. వారిని పరిగణనలోకి తీసుకోవాలని బోర్డును ఆదేశించింది. నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: Etela on CM KCR: నిరుద్యోగులు, రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారు: ఈటల