ETV Bharat / state

మృతదేహాలకూ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందే: హైకోర్టు - high court on corona tests in the state

మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాలకూ కరోనా పరీక్షలు జరపాల్సిందేనని స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. రాష్ట్రంలో తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికి లక్షణాలు లేకపోయినప్పటికీ.. పరీక్షలు ఎందుకు జరపడం లేదని అడిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీల్లో ఎంత మందికి కరోనా పరీక్షలు జరిపారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

high court suggested govt to  Corona tests are also required for dead bodies
మృతదేహాలకూ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందే: హైకోర్టు
author img

By

Published : May 26, 2020, 8:31 PM IST

రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో ఎందుకు జరుగుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా పరీక్షలకు సంబంధించి విశ్రాంత ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, న్యాయవాది నరేశ్​రెడ్డి, సూర్యాపేటకు చెందిన బీజేవైఎం నాయకుడు సంకినేని వరుణ్, విశ్రాంత డీఎంహెచ్​వో రాజేందర్​లు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్​ రెడ్డితో కూడిన ధర్మాసనం ఎదుట రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకులు శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 24,443 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించారు.

దేశమంతటా ఒకే తీరుగా ఉండవా..?

దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో పరీక్షలు ఎందుకు జరిగాయని ప్రశ్నించింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు దేశమంతటా ఒకే తీరుగా ఉండవా అని వ్యాఖ్యానించింది. కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉండే వృద్ధులు, కంటైన్​మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న హైబీపీ, మధుమేహంతో బాధపడుతున్న వారికి లక్షణాలు లేకపోయినప్పటికీ.. పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది.

ఆ లేఖలు సమర్పించండి..

కరోనా పరీక్షలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖలు రాసినట్లు పత్రికల్లో చదివామని.. ఆ లేఖలు తమకు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. మార్చి 11 నుంచి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంత మందికి పరీక్షలు జరిపారో జిల్లాల వారీగా పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

మృతదేహాల నుంచి రక్త నమూనాలను సేకరించి కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ గతంలో వైద్యారోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. ఉత్తర్వులు చెల్లవంటూ కొట్టివేసింది. ఆస్పత్రుల్లో మరణించే వారి మృతదేహాలకు పరీక్షలు జరిపి.. కరోనా వైరస్ ఉందో లేదో తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. లాక్ డౌన్​ మినహాయింపుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. హైదరాబాద్​లోనూ అమెరికా పరిస్థితులు రావొచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది.

పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలి..

రాష్ట్రంలో మాస్కులు, పీపీఈ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో... ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో నివేదిక సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది వలస కూలీలు రాష్ట్రానికి వచ్చారు? వారందరికీ కరోనా పరీక్షలు చేశారా? క్వారంటైన్ ఎలా చేస్తున్నారు వంటి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీచూడండి: లాక్​డౌన్ వల్ల మరింత తగ్గనున్న రాష్ట్ర జీఎస్​డీపీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.