ETV Bharat / state

5నెలలైనా కౌంటర్​ దాఖలు చేయరా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు - ధరణి వెబ్​ పోర్టల్ అంశంపై హైకోర్టులో మరోసారి విచారణ

ధరణి వెబ్‌ పోర్టల్ నమోదులో భాగంగా ఆధార్​పాటు కులం, కుటుంబసభ్యుల వివరాలను అడగరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. అదేవిధంగా వ్యవసాయ భూములను ధరణిలో నమోదు చేయడంపై దాఖలైన పిటిషన్​లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై ఏమైనా అభ్యంతరాలుంటే పిటిషనర్లు రిఫై కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 8కి వాయిదా వేసింది.

high court
high-court-stay-extend-on-non-agriculture-assets-registration
author img

By

Published : Jun 22, 2021, 9:48 AM IST

Updated : Jun 22, 2021, 10:35 AM IST

ధరణి పోర్టల్​లో ఆస్తుల నమోదు నిమిత్తం ఆధార్ వివరాలను ఆడగటాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు గోపాల్ శర్మ, కాశీభట్ల సాకేత్​లు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. వీటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ అంశాలు మంత్రి మండలి పరిశీలనలో ఉన్నాయని... తగిన సూచనల కోసం జనవరిలో గడువు తీసుకున్నారని తెలిపింది. అలాగే ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ స్పందిస్తూ... ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక సూచనలు అందలేదని చెప్పారు.

ఆధార్ వివరాలు సేకరించవచ్చు..

వ్యవసాయ భూముల వివరాలను ధరణిలో నమోదు చేయడానికి ఆధార్ వివరాలు సేకరించవచ్చని బి.ఎస్.ప్రసాద్ అన్నారు. వ్యవసాయ భూములకు రైతుబంధు పథకంతో పాటు విత్తనాలు, ఎరువులు తదితరాలు సబ్సిడీ కింద ప్రభుత్వం అందజేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఆధార్ వివరాలను సేకరించవచ్చని తెలిపారు. ఇది చట్టవిరుద్ధం కాదని పేర్కొన్నారు. వ్యవసాయేతర భూములను కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్​మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. ఇందులో ఎలాంటి వివరాలను సమర్పించాలని ప్రభుత్వం కోరడం లేదని, గతంలోలాగే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశామని, తుది విచారణ చేపట్టి తేల్చాల్సి ఉందని తెలిపారు.

కౌంటర్లు దాఖలు చేయాలి..

సీనియర్ న్యాయవాదులు డి.ప్రకాశ్ రెడ్డి, కె.వి.రెడ్డిలు వాదనలు వినిపిస్తూ... ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తులు, వ్యవసాయ భూములను నమోదు చేయడంపై రెండు పిటిషన్లు దాఖలయ్యాయన్నారు. ఎలాంటి చట్టం లేకుండా ధరణి పోర్టల్​ను అమలు చేయడం సరికాదని వాదించారు. అలాగే ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో వ్యక్తిగత సమాచారం బహిర్గతమయ్యే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరో వ్యాజ్యంలో వ్యవసాయ భూములకు సంబంధించినదని.. ఇందులో ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటరు దాఖలు చేయలేదని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ గత జనవరిలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించామని... 5 నెలలైనా దాఖలు చేయరా అంటూ ప్రశ్నించింది. వచ్చే విచారణకల్లా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని, దీనిపై అభ్యంతరాలను సమర్పించాలంటూ పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 8 కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: వరంగల్​ అర్బన్​ పేరు హన్మకొండ జిల్లాగా మార్పు

Last Updated : Jun 22, 2021, 10:35 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.