ఓటర్ల జాబితాకు అనుసరిస్తున్న సాఫ్ట్‌వేర్, అల్గారిథమ్ పారదర్శకంగా ఉంచేలా ఆదేశించాలని, సోర్స్ కోడ్ వెల్లడించాలని, సాప్ట్‌వేర్‌కు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించి ఆధార్ సమాచారాన్ని తొలగించాలని కోరుతూ హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన శ్రీనివాస్ కొడాలి గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది బి.అర్జున్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్‌కు అందజేస్తున్న వివరాలు, ఓటర్లకు సంబంధించిన ఆధార్‌కార్డు వంటి వాటితో సహా ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ కులం, కేటగిరీతదితర వివరాలన్నీ బయటికి పొక్కుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం వల్ల ఒక కులం, వర్గాన్ని ఎంపిక చేసుకుని సాఫ్ట్‌వేర్‌తో తొలగిస్తున్నారన్నారు. తెలంగాణలో 27 లక్షలు, ఏపీలో 19లక్షల ఓటర్లను తొలగించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానం పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నారు.
నకిలీ ఓటర్ల తొలగింపులో రాష్ట్రప్రభుత్వాల పాత్రకు సంబంధించి ఆధారాలు లేనపుడు ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంది. ఆధార్ డేటా తొలగింపుతో సహా రాష్ట్రప్రభుత్వాల పాత్రకు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ అనుబంధ పిటిషన్‌లను కొట్టివేసింది. అయితే ఆధార్ డేటా తొలగింపు విచారణాంశమని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని తెలిపింది.
ఇవీ చదవండి:కన్నడనాడి: ఓట్ల బదిలీ సాధ్యమేనా?