వరిసాగుపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వరి విత్తనాలమ్మితే చర్యలు తీసుకుంటామన్న వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ తీరుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సిద్దిపేట జిల్లాలో వరి విత్తనాల విక్రయాల్లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యల కోసం సీజే ధర్మాసనానికి పంపించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
మెదక్ రైతు నారాయణ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వరిసాగుపై కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నా కూడా.. పట్టించుకోబోమని కలెక్టర్ వ్యాఖ్యానించారని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వరి విత్తనాల విక్రయంపై నిషేధం లేదని ఏజీ ప్రసాద్... ఉన్నత న్యాయస్థానానికి వివరించారు.
ఇదీ చూడండి: