High Court Ordered TS Government To File A Counter: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీజేపీ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి దుబ్బాక నియోజకవర్గానికి ఎస్డీఫ్ నిధులు మంజూరు చేయడం లేదని రఘునందన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని.. విపక్ష శాసనసభ్యులున్న చోట వివక్ష చూపుతున్నారని రఘునందన్ తరపున న్యాయవాది రచనారెడ్డి వాదించారు. గజ్వేల్, సిద్ధిపేట వంటి నియోజకవర్గాలకు నిధులు ఇస్తూ.. అదే జిల్లాలోని తన దుబ్బాకకు మూడేళ్లుగా నిధులు ఇవ్వడం లేదన్నారు. రఘునందన్ పిటిషన్‌పై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సీఎస్, జీఏడీ, ఆర్థిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సిద్ధిపేట, మెదక్ కలెక్టర్లు, మెదక్ ముఖ్య ప్రణాళిక అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎస్‌డీఎఫ్ నిధులపై శ్వేతపత్రం ఇస్తే బాగుంటుంది: ఎస్‌డీఎఫ్ నిధులు ఏ నియోజకవర్గానికి ఎంత ఇచ్చారో శ్వేతపత్రం ఇస్తే బాగుంటుందని తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తన జిల్లాలో గజ్వేల్, సిద్దిపేటకు మాత్రమే ఎస్‌డీఎఫ్ నిధులు ఇస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ ప్రజలు తమ పైసలు తమకే కావాలంటే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని వివరించారు.
ఇవీ చదవండి:
తెలంగాణ ఏర్పాటు తర్వాత గణనీయంగా అప్పులు పెరిగాయన్న కేంద్రం
'కేసీఆర్ లెక్కలపై చర్చకు సిద్ధం.. ప్రగతిభవన్‌కు రావాలా.. ఫామ్‌హౌస్‌కా?'