ETV Bharat / state

ధరల పెరుగుదలపై స్పందించిన హైకోర్టు

author img

By

Published : Mar 26, 2020, 6:37 AM IST

కూరగాయల ధరల పెరుగుదలపై హైకోర్టు స్పందించింది. ఓ పత్రిక కథనాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా ధర్మాసనం స్వీకరించింది.

high court
high court

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో విపణిలో కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంపై హైకోర్టు స్పందించింది. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా న్యాయస్థానం స్వీకరించింది. ఫలక్​నుమా రైతుబజారు, మీరాలంమండి, మెహదీపట్నం ప్రాంతాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెంచారని కథనంలో వివరించారు.

ఈ నేపథ్యంలో కూరగాయల ధరలతో పాటు నిత్యావసర వస్తువులు, పండ్ల ధరల నియంత్రణకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని పేర్కొంది. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ సీఎస్​, వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, సంబంధిత అధికారులను చేర్చారు. దీనిపై శుక్రవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ధరల పెరుగుదలపై స్పందించిన హైకోర్టు

ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.