హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పబ్‌లలో రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌కు అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మార్చేందుకు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం నిరాకరించింది. జూబ్లీహిల్స్‌లో జనావాసాల మధ్య పబ్‌లలో అర్ధరాత్రి వరకు మ్యూజిక్, సౌండ్ సిస్టమ్స్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు పబ్‌లలో మ్యూజిక్ ఉండరాదని ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతూ మూడు పబ్‌ల యాజమానులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. గతంలో విధించిన ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: కేసీఆర్ హఠావో... తెలంగాణ బచావో: ఎంపీ లక్ష్మణ్
'ఇండియా ఫస్ట్'.. తల్లి మరణించిన బాధలోనూ కర్తవ్యాన్ని మరవని మోదీ