భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అడవుల్లో జరిగిన లింగన్న ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. లింగన్నను బూటకపు ఎన్కౌంటర్లో చంపారని పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం లింగన్న మృతదేహానికి రేపు సాయంత్రం ఆరు గంటలలోగా రీపోస్టుమార్టం నిర్వహించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించి ఆగస్టు 5లోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఎన్కౌంటర్ ఛత్తీస్‌గఢ్ పరిధిలో జరిగిందని విచారణ సమయంలో అదనపు అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఇవీ చూడండి: అదిగో చిరుత, ఇదిగో తోక... అంతా ఉత్తదే..