HC Notice to Minister Puvvada Ajay: కోర్టు ధిక్కరణ కేసులో మమత మెడికల్ ఛైర్మన్, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కి హైకోర్టు నోటీసు ఇచ్చింది. పీజీ వైద్య విద్య కోర్సుల ఫీజుల విషయంలో ఉన్నత న్యాయస్థానం ఈ నోటీసు జారీ చేసింది. పీజీ వైద్య కోర్సులకు ఫీజులు పెంచుతూ 2017లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజుల పెంపును విద్యార్థులు సవాల్ చేయడంతో విచారణ జరిపిన హైకోర్టు జీవోను కొట్టివేసి, 2016లో ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన రుసుములే వసూలు చేయాలని గతేడాది తీర్పు వెల్లడించింది.
మెడికల్ కాలేజీలు అప్పటికే ఫీజులు వసూలు చేసినందున.. ఎక్కువగా తీసుకొన్న సొమ్మును విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తనకు రావల్సిన సొమ్మును మమత వైద్య కళాశాల ఇవ్వడం లేదని నిఖిల్ అనే విద్యార్థిని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై స్పందించిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం వివరణ ఇవ్వాలని పువ్వాడ అజయ్‌ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: