ETV Bharat / state

High court on Podu lands: ఆ చట్టం ప్రకారమే దరఖాస్తులు స్వీకరించాలి: హైకోర్టు

అటవీ హక్కుల చట్టం ప్రకారమే పోడుభూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ(High Court issued interim orders on podu lands) చేసింది. పోడు భూములపై ములుగు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. గోవిందరావుపేటకు చెందిన అటవీ హక్కుల కమిటీ ఛైర్మన్, తదితరులు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

High Court issued interim orders
పోడు భూములపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
author img

By

Published : Nov 27, 2021, 10:35 PM IST

గిరిజనుల పోడుభూములపై హక్కుల క్రమబద్ధీకరణకు రక్షిత అటవీ హక్కుల చట్టం(ROFR) ప్రకారమే దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు(High Court issued interim orders) జారీ చేసింది. అటవీ భూముల్లో సాగు చేస్తున్న వారికి వ్యక్తిగత హక్కులను మాత్రమే క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తులు స్వీకరించాలంటూ ఈనెల 2న ములుగు కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

ములుగు కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను( pil on mulugu collector orders) సవాల్ చేస్తూ గోవిందరావుపేటకు చెందిన అటవీ హక్కుల కమిటీ ఛైర్మన్, తదితరులు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఆర్ఓఎఫ్ఆర్ ప్రకారం వ్యక్తిగత హక్కులతో పాటు సామాజిక, గ్రామసభలపై హక్కులు కల్పించేలా దరఖాస్తులు స్వీకరించాల్సి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.

అధికారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే ప్రభుత్వం పోడుభూముల క్రమబద్ధీకరణ(regularization of podu lands) ప్రక్రియ చేపట్టిందన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా ప్రక్రియ నిర్వహిస్తున్నారన్నారు. ఆర్ఓఎఫ్ఆర్(ROFR) ప్రకారమే దరఖాస్తులు స్వీకరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ డిసెంబరు 7కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

Podu land registration : పోడుభూముల సమస్య పరిష్కారానికి భారీ దరఖాస్తులు

Pil in High Court: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే

పోడుభూముల సమస్య పరిష్కార విధానంపై సీఎస్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.