ETV Bharat / state

చట్టవిరుద్ధమని ప్రకటించలేం.. ఒత్తిడి తీసుకురాలేం - హైకోర్టు

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని ఏ ప్రాతిపదికన ప్రకటించగలమని హైకోర్టు ప్రశ్నించింది. అతి ముఖ్యమైన సేవల పరిధిలోకి ఆర్టీసీని తెస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వక పోతే... కార్మికుల సమ్మె ఎస్మా పరిధిలోకి లేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని పలు మార్లు కోరామని... ఒత్తిడి తెచ్చే చట్టపరమైన అధికార పరిధి తమకు ఎలా ఉంటుందని ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలు మంగళవారం వరకు పొడిగించింది.

చట్టవిరుద్ధమని ప్రకటించలేం.. ఒత్తిడి తీసుకురాలేం
author img

By

Published : Nov 12, 2019, 5:03 AM IST

చట్టవిరుద్ధమని ప్రకటించలేం.. ఒత్తిడి తీసుకురాలేం

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించిన వ్యాజ్యాలన్ని చట్టపరిధిలోనే విచారణ జరిపి తేలుస్తామని హైకోర్టు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. భార్యాభర్తల వివాదాలు తమ ముందుకు వచ్చినప్పడు... వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుగా కౌన్సెలింగ్ ద్వారా ప్రయత్నిస్తామని... విఫలమైతే పిటిషన్లను చట్టబద్ధంగా తేలుస్తామని పేర్కొంది. అదే తరహాలో ఆర్టీసీ సమ్మె విషయాన్ని పరిష్కరించేందుకు నెల రోజులుగా ప్రయత్నించామని... అలా వీలు కానందున తమ ముందున్న వ్యాజ్యాల చట్టబద్ధత తేలుస్తామని వెల్లడించింది. సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ... దాఖలైన వ్యాజ్యాలు కాలం చెల్లినందున వాటిపై విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది.

ఏ ప్రాతిపదికన ఆదేశాలివ్వాలి:

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని, కార్మికులతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలన్నీ కలిపి విచారణ జరిపి ఒకే ఉత్తర్వు ఇస్తామని ధర్మాసనం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించి... విధుల్లోకి చేరేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు ఏ ప్రాతిపదికన ఆదేశాలు ఇవ్వగలదో వివరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అతి ముఖ్యమైన సేవల నిర్వహణ చట్టం.. ఎస్మా ప్రకారం ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టం విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఆర్టీసీ అతి ముఖ్యమైన సర్వీసుగా పేర్కొంటూ ఎస్మా చట్టం ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన జీవో చూపాలని ధర్మాసనం అడిగింది. ఆర్టీసీని ప్రజా వినియోగ సర్వీసుగా ప్రకటించినందున.. ప్రత్యేకంగా జీవో అవసరం లేదని పిటిషనర్లు వాదించారు. ప్రజా వినియోగ సర్వీసులన్నీ ఎస్మా పరిధిలోకి రావన్న హైకోర్టు... ప్రభుత్వం జీవో ఇవ్వక పోతే... ఎస్మా కింద చట్ట విరుద్ధమని ప్రకటించలేమని స్పష్టం చేసింది.

జోక్యం ఎలా..?

కార్మిక శాఖ వద్ద మధ్యవర్తిత్వం ప్రక్రియ పెండింగ్​లో ఉండగానే... కార్మికులు సమ్మెకు దిగడం పారిశ్రామిక వివాదాల చట్టానికి విరుద్ధమని ప్రభుత్వం తరఫున పిటిషనర్లు వాదించారు. అలాంటి సందర్భాల్లో సమ్మె చట్ట విరుద్ధమని ఎవరు ప్రకటించాలి.. దానికి సంబంధించిన ప్రక్రియ ఏంటో వివరించాలని హైకోర్టు అడిగింది. కోర్టుకు సహకరించాలని కార్మిక చట్టాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ న్యాయవాది విద్యాసాగర్​ను ధర్మాసనం కోరింది. కార్మిక శాఖ మధ్యవర్తిత్వం విఫలమైతే... తదుపరి చర్యలకు ప్రభుత్వం లేబర్ కోర్టుకు సిఫార్సు చేయాలని.. లేబర్ కోర్టు నిర్ణయం తీసుకుంటుందని న్యాయవాదులు వివరించారు. అలాంటప్పుడు నేరుగా తామెలా జోక్యం చేసుకోగలమని... లేబర్ కోర్టే నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే... ఆర్టీసీ యాజమాన్యం తమ వద్దకు వస్తే పరిశీలించగలమని.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో నిర్ణయం తీసుకోలేమని తెలిపింది.

ఒత్తిడి తీసుకురాలేం..

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున హైకోర్టు జోక్యం చేసుకోవచ్చునని పిటిషనర్లు వాదించారు. వివాదం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పలు మార్లు కోరారమని... ఒత్తిడి తెచ్చే చట్టపరమైన అధికార పరిధి హైకోర్టుకు ఎలా ఉంటుందని పేర్కొంది. కార్మికులు చేరితే చేరండి.. లేకపోతే లేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నప్పుడు... తామెలా ఒత్తిడి తేగలమో చెప్పాలని పిటిషనర్లను అడిగింది. కోర్టులు పిటిషన్లను చట్ట పరిధిలోనే తేలుస్తాయి తప్ప భావోద్వేగాలు, సానుభూతితో నిర్ణయాలు తీసుకోలేదని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం పైనా లేదా కార్మిక సంఘాల పైనా ప్రజలే ఒత్తిడి తేవచ్చునని వ్యాఖ్యానించింది. నేడు మరిన్ని వాదనలు వింటామన్న హైకోర్టు... రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలు మంగళవారం వరకు పొడిగించింది.

ఇవీచూడండి: ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో ఇచ్చారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.