ETV Bharat / state

ఏ ఉత్తర్వుల ప్రకారం పోలీసులను మొహరించారు: హైకోర్టు - hyderabad latest news

ఏ ఉత్తర్వుల ప్రకారం సచివాలయం వద్ద పోలీసులను మొహరించారో తెలపాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించింది. సచివాలయం కూల్చివేతల కవరేజీకి అనుమతివ్వాలన్న పిటిషన్​పై జస్టిస్ చల్లా కోదండరాం శనివారం విచారణ చేపట్టారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

high court hearing on secretariat demolished media coverage
ఏ ఉత్తర్వుల ప్రకారం పోలీసులను మొహరించారు: హైకోర్టు
author img

By

Published : Jul 25, 2020, 3:57 PM IST

సచివాలయం కూల్చివేతల కవరేజీకి అనుమతివ్వాలన్న పిటిషన్​పై శనివారం హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం పిటిషన్​ విచారించారు. పిటిషనర్​కు విచారణ అర్హత లేదని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. వీఐఎల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున సంస్థ భాగస్వాములు కాకుండా.. ఉద్యోగి పిటిషన్ దాఖలు చేయడం కుదరదని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సంస్థ తరఫున ఉద్యోగి కూడా పిటిషన్ వేయవచ్చునని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అవసరమైతే సంస్థ యాజమాన్య ప్రతినిధులను కూడా చేరుస్తామని తెలిపారు. ప్రభుత్వం కూడా కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏ ఉత్తర్వుల ప్రకారం పోలీసులను మొహరించారో తెలపాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: వినాలంటే కొండెక్కాల్సిందే.. టెంట్​ వేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.