ETV Bharat / state

రేపటి లోగా వివరాలివ్వండి.. స్టే కొనసాగుతుంది : హైకోర్టు

సచివాలయం భవనాల కూల్చివేతలకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అనే వివాదంలో కేంద్ర ప్రభుత్వ వివరణే కీలకమని హైకోర్టు పేర్కొంది. రేపటిలోగా వివరణ ఇవ్వాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావుకు మరోసారి స్పష్టం చేసింది. విచారణను రేపటికి వాయిదా వేస్తూ.. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది.

high court hearing on secretariat demolished in hyderabad
కేంద్ర ప్రభుత్వ వివరణే కీలకం: హైకోర్టు
author img

By

Published : Jul 16, 2020, 5:41 PM IST

సచివాలయం కూల్చివేతలు ఆపాలంటూ తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.

కూల్చివేతలు, నిర్మాణాల నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు అవసరం లేదని పీసీబీ నివేదించింది. కూల్చివేతలు, నిర్మాణాల నిబంధనలను అడగలేదని.. పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారం అనుమతి అవసరమా అని ప్రశ్నిస్తే.. సరైన సమాధానం ఇవ్వలేదని పీసీబీపై అసహనం వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానం. నివేదికలుగా తెలివిగా ఇవ్వొద్దని.. నిజాయితీగా ఇవ్వాలని వ్యాఖ్యానించింది.

కూల్చివేతలకు అనుమతి అవసరమా లేదా..? నిర్మాణం కోసం భూమిని సిద్ధం చేయడమంటే ఏమిటి..? పాత భవనాల కూల్చివేతలు కొత్త నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడానికి కాదా.. అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని మరోసారి ఆదేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను స్పష్టత కోరామని.. ఇంకా వివరాలు అందలేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు తెలిపారు. సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరగా నిరాకరించిన ధర్మాసనం.. ఈ అంశాన్ని మరింత కాలం సాగదీయలేమని స్పష్టం చేసింది. రేపటిలోగా వివరాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేస్తూ.. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.