రాష్ట్రంలో ప్రస్తుతం కరవు పరిస్థితులు లేవని అభిప్రాయపడిన హైకోర్టు.. బేవరేజెస్ సంస్థలకు నీరు కేటాయించవద్దని రేవంత్ రెడ్డి వేసిన పిల్‌పై విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. కూల్ డ్రింక్‌ల తయారీ కోసం నీళ్లు విడుదల చేయవద్దని రేవంత్ రెడ్డి 2016లో పిల్ వేశారు. నాలుగేళ్లలో పరిస్థితి మారినందున పిల్‌పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. తాగు సాగు నీటి కొరత ఉన్నందున బేవరేజెస్‌కు నీరు విడుదల చేయవద్దని రేవంత్ రెడ్డి పిల్‌లో కోరారు. జాతీయ జల విధానం ప్రకారం పరిశ్రమలకు 10శాతం నీరు కేటాయించవచ్చునని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినందున రాష్ట్రంలో ప్రస్తుతం నీటి కొరత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. పరిశ్రమలకు నీటి కేటాయింపులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిందని జలమండలి ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసువెళ్లింది. సీడబ్ల్యూసీ జాతీయ జల విధానానికి అనుగుణంగానే పరిశ్రమలకు నీరు కేటాయించాలని నిర్దేశించిన హైకోర్టు రేవంత్ రెడ్డి పిల్‌పై విచారణను ముగించింది.
ఇవీ చదవండి: