ETV Bharat / state

'కంపెనీ రుణాలకు వ్యక్తిగత హామీదారులను బాధ్యులను చేయడంపై వివరణ ఇవ్వండి' - high court latest hearings

కంపెనీల రుణాలకు వ్యక్తిగత హామీ దారులపై... దివాలా ప్రక్రియ చేపట్టేలా జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఎస్​బీఐ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

'కంపెనీ రుణాలకు వ్యక్తిగత హామీదారులను బాధ్యులను చేయడంపై వివరణ ఇవ్వండి'

author img

By

Published : Sep 24, 2020, 12:42 AM IST

కంపెనీల రుణాలకు వ్యక్తిగత హామీ దారులపై... దివాలా ప్రక్రియ చేపట్టేలా జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతేడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రుణానికి సంబంధించి ఆ కంపెనీ ఛైర్మన్ సురేంద్ర తదితరులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. నోటీసులతో పాటు.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సురేంద్ర దాఖలు చేసిన పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

కంపెనీల రుణాలకు వ్యక్తిగత హామీదారులను బాధ్యులను చేయడం రాజ్యాంగ విరుద్ధంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కొన్ని వర్గాలకే పరిమితమయ్యేలా ఆ నిబంధనలు ఉండటం వివక్షపూరితమన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. నోటిఫికేషన్ చట్టబద్ధతపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. ఎస్​బీఐ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. శిక్షణ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.