ETV Bharat / state

విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోతకు ఆర్డినెన్స్ జారీ: ఏజీ - విశ్రాంత ఉద్యోగుల పింఛన్​లో హైకోర్టులో విచారణ

అత్యవసర పరిస్థితుల్లో విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోత విధించేలా ఆర్డినెన్స్ జారీ చేసినట్టు హైకోర్టుకు ఏజీ నివేదించారు. తమ పిటిషన్​ను సవరించేందుకు అనుమతివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా... తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 24కు వాయిదా వేసింది.

విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోతకు ఆర్డినెన్స్ జారీ: ఏజీ

author img

By

Published : Jun 17, 2020, 3:48 PM IST

అత్యవసర పరిస్థితుల్లో విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోత విధించేలా ఆర్డినెన్స్ జారీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర పెన్షనర్ల జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్యతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఏ చట్టం ప్రకారం ఫించనులో కోత విధించారో తెలపాలని ఈ నెల 15న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్డినెన్స్ తెచ్చినట్టు ఇవాళ ఏజీ హైకోర్టుకు నివేదించారు.

ఆర్డినెన్స్ వివరాలు పిటిషనర్లకు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ఆర్డినెన్స్ చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఆర్డినెన్స్​ను సవాల్​ను చేస్తూ... తమ పిటిషన్​ను సవరించేందుకు అనుమతివ్వాలని హైకోర్టును న్యాయవాది కోరారు. పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'ముందస్తు ప్రణాళికతోనే భారత జవాన్లపై దాడి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.