ETV Bharat / state

HighCourt on Telangana Floods : వరద ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - Minister Koppula Eshwar Election Controversy

Telangana High Court Latest News : రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భారీ వర్షాలు, వరదలపై.. ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలపై డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతోపాటు ఓఆర్​ఆర్​ టెండర్​ విషయంలో ఎంపీ రేవంత్​ రెడ్డి వేసిన పిటిషన్, తెలంగాణలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ పిటిషన్​లపైనా ఉన్నత న్యాయస్థానం విచారించింది.

HighCourt on Telangana Floods
HighCourt on Telangana Floods
author img

By

Published : Jul 28, 2023, 6:20 PM IST

Updated : Jul 28, 2023, 6:56 PM IST

High Court on Telangana Rains And floods : తెలంగాణ హైకోర్టులో పలు కీలక పిటిషన్​లపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలపై డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున వాదించిన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌.. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనలో ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

వాదనలు విన్న ధర్మాసనం.. వరద బాధితుల సహాయార్థం వరద ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే.. వరదల్లో ఎంత మంది మరణించారు? బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారా? అనే దానిపై నివేదిక ఇవ్వాలని కోరింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారా.. లేదా? అనే విషయాలను కూడా వివరించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారో చెప్పాలని హైకోర్టు తెలిపింది. డ్యామ్ పరిరక్షణ చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారా..? అనే విషయాలపై సమగ్ర వివరాలతో ఈ నెల 31వ తేదీకి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

High Court on ORR tender lease issue : అలాగే రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శలకు దారి తీసిన ఓఆర్‌ఆర్‌ టోల్‌ కాంట్రాక్టు విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్​ రెడ్డి వేసిన పిటిషన్​పైనా హైకోర్టు విచారణ చేపట్టింది. ఓఆర్‌ఆర్‌ టెండర్లపై ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వడం లేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎంపీ అడిగిన సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ఏజీని ప్రశ్నించింది. ఎంపీకి సమాచారం ఇవ్వకపోతే పార్లమెంట్‌లో ఎలా చర్చించగలరని న్యాయస్థానం పేర్కొంది. సమాచార హక్కు చట్టం పరిమితుల మేరకు సమాచారం ఇస్తారని ఈ సందర్భంగా ఏజీ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని కోరగా.. హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

HC on local body elections in Telangana : తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 220 సర్పంచ్, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5,364 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందని పిటిషనర్‌ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న హైకోర్టు.. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం అంగీకరిస్తే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.

HC on Koppula Eshwar Election Controversy : మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. కొప్పుల ఈశ్వర్​ తరపున వాదించిన న్యాయవాది.. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పిటిషన్‌ కొట్టేయాలని పేర్కొన్నారు. వివాదానికి సంబంధించి తన అభ్యంతరాలను మరోసారి పరిశీలించాలని పటిషనర్​ లక్ష్మణ్ కోరారు. ఇద్దరి మధ్యంతర పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 28, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.