ETV Bharat / state

AP High Court: గ్రామ సచివాలయాలపై హైకోర్టు విచారణ.. జీవో 2 సస్పెండ్ - ఏపీ వార్తలు

ఏపీలో గ్రామ సచివాలయాలపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. సర్పంచులు, గ్రామ కార్యదర్శుల హక్కుల బదిలీపై వాదనలు విన్న కోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 2ను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

AP High Court
AP High Court
author img

By

Published : Jul 12, 2021, 3:59 PM IST

గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ మార్చి 25న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 2ను ఆ రాష్ట్ర హైకోర్టు సస్పెండ్‌ చేసింది. కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. పంచాయతీ కార్యదర్శుల హక్కుల్ని హరించేలా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73 సవరణకు, ఏపీ పంచాయతీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా జీవో ఉందని కోర్టుకు తెలిపారు.

సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. దీనిపై గతంలోనూ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. గ్రామపంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ల కూడదని అడిగింది.

రాష్ట్రానికి సీఎం ఎలా అధిపతో.. పంచాయతీలకు సర్పంచ్‌ కూడా అలాగేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోషియేషన్‌ గౌరవ ఛైర్మన్‌ బుచ్చిరాజు అన్నారు. డ్రాయింగ్‌, డిస్బర్సింగ్‌ అధికారాలు పంచాయతీ కార్యదర్శులకే ఉండాలన్నారు.

ఇదీ చూడండి: GOVERNOR TAMILISAI: 'గిరిజనులతో కలిసి టీకా తీసుకోవడం సంతోషంగా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.