సైబర్‌క్రైం పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సునీల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. కాంగ్రెస్ వార్ రూంతో ఎలాంటి సంబంధం లేదన్న సునీల్ తరఫు న్యాయవాది.. ఆయన కాంగ్రెస్ జాతీయ టాస్క్‌ఫోర్స్ సభ్యుడని పేర్కొన్నారు. పోలీసులు పేర్కొంటున్న అభ్యంతరకర వీడియోలతో సునీల్‌కు సంబంధం లేదని వివరించారు.
పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడిగా లేకపోయినా.. జనవరి 8న హాజరుకావాలని సీఆర్‌పీసీ 41ఏ నోటీసులిచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సునీల్ కనుగోలు.. దిల్లీలో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. జనవరి 8లోగా తీర్పును వెల్లడిస్తామని వాయిదా వేసింది.
ఇవీ చదవండి: