మనీలాండరింగ్ కేసులో అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణకు సహకరించాలని నిందితులకు స్పష్టం చేసింది. మనీలాండరింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలతో అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఏవీ శేషు నారాయణ రావు, హేమ సుందర ప్రసాద్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
ఈ కేసులో ఈడీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. ఈడీ విచారణకు సహకరించాలని నిందితులకు స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారంలో మరో ఐదుగురు నిందితులకు ముందస్తు బెయిల్ లభించింది.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత చాకో రాజీనామా