భూముల క్రమబద్దీకరణ దరఖాస్తు గడువు పెంచే అవకాశాలను ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఎల్ఆర్ఎస్ను సవాల్ చేస్తూ కప్పర హరిప్రసాద్ రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఎల్ఆర్ఎస్పై దాఖలైన ఇతర వ్యాజ్యాలతో కలిపి విచారణ చేపడతామని.. దీనిపైనా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దరఖాస్తుల గడువు ఎప్పటి వరకు ఉందని ఏజీని హైకోర్టు ఆరా తీసింది. ఈ నెలాఖరు వరకు ఉందని ఏజీ పేర్కొనగా.. దసరా సెలవులు ఉన్నందున అది తక్కువ సమయమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇదీ చూడండి : 'ఆ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'