high court on revenue issues: ప్రభుత్వం ధరణి పోర్టల్ వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రెవెన్యూ ట్రైబ్యునళ్ల నుంచి వచ్చే కేసుల సంఖ్య పెరుగుతుండటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ కేసుల పరిష్కారానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. సింగిల్ విండో పద్ధతి పెట్టడంతో ఈ కోర్టుపై రోజుకు 200 నుంచి 300 కేసులు వచ్చి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రత్యామ్నాయం లేకపోవడంతో అందరూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపింది. ఈ అంశాన్ని పరిశీలించాలని న్యాయశాఖకు చెప్పాలని సూచించింది. లేని పక్షంలో మేమే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని పేర్కొంది. మున్సిపల్ వివాదానికి సంబంధించి ఓ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అడ్వొకేట్ జనరల్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. దీనిపై ఏజీ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ రెవెన్యూ వివాదాలకు పరిష్కార మార్గాలున్నాయని అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఇదీ చూడండి: