వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు ఉన్నత న్యాయస్థానం అనుమతి తెలిపింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అంగీకారం తెలిపింది. రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్లాట్ బుకింగ్ విధానాన్ని కోర్టు అనుమతించింది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనను కూడా అంగీకరించింది.
ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగబోమని ప్రభుత్వం కోర్టుకు తెలపగా... ప్రభుత్వ వినతి మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఎప్పుడూ స్టే ఇవ్వలేదని ఉన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. ధరణిపై మరో 5 అనుబంధ పిటిషన్లను పిటిషనర్లు దాఖలు చేయగా... కౌంటర్ దాఖలుకు ఏజీ బీఎస్ ప్రసాద్ గడువును కోరారు. ధరణిపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు'