హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ అనేకమంది కోర్టులకు వస్తున్నారన్న ధర్మాసనం.... వీటికి అడ్డుకట్ట పడాల్సిందేనని తెలిపింది. అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2019లో గుర్తించిన అక్రమ నిర్మాణాలు... తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించింది. స్టేలు తొలగించాలని కోర్టుల్లో ఎన్ని పిటిషన్లు వేశారో తెలపాలన్న హైకోర్టు... స్టే వెకేట్ పిటిషన్లు వేయకపోతే కారణాలు తెలపాలని ఆదేశించింది. అక్రమ కట్టడాలపై తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: సగం పోస్టులు ఖాళీ ఉంటే సత్వర న్యాయం ఎలా?: హైకోర్టు