ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పరిధిలోని వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో గందరగోళ పరిస్థితి ఉందని.. ఎన్నికలు నిలిపివేయాలంటూ పలువురు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ చేపట్టి ఎన్నికలు నిలివేయాలని ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. తాజాగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఫలితాల వెల్లడికి పచ్చజెండా ఊపింది.
ఇదీ చదవండి: తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణం