ETV Bharat / state

High Court On Abortion: బాలికపై అత్యాచారం.. ఆ గర్భం తొలగింపునకు హైకోర్టు ఓకే! - High Court allows abortion of raped girl

high-court-allows-abortion-of-raped-girl

author img

By

Published : Oct 7, 2021, 8:30 PM IST

Updated : Oct 8, 2021, 7:05 AM IST

20:26 October 07

16 ఏళ్ల బాలిక 25 వారాల గర్భం విచ్ఛితికి హైకోర్టు అనుమతి

అత్యాచార బాధితురాలి గర్భం తొలగింపుపై తెలంగాణ హైకోర్టు (High Court On Abortion) కీలక తీర్పును వెల్లడించింది. లైంగిక దాడి, అత్యాచారంతో అవాంఛనీయ గర్భాన్ని చట్టపరిమితులకు లోబడి వద్దనుకునే హక్కు ఉంటుందంటూ న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి (Justice Vijayasen Reddy) తీర్పు వెల్లడించారు. పదహారేళ్ల అత్యాచార బాధితురాలికి అబార్షన్ చేయాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్​ను ఆదేశించింది.  

సమీప బంధువే...

పదహారేళ్ల బాలికపై సమీప బంధువు ఆంజనేయులు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా.. గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. అవాంఛిత గర్భాన్ని (Abortion) తొలగించాలని బాలిక, ఆమె తల్లి కోరగా కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. తన తల్లి ద్వారా బాలిక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కమిటీ ఏర్పాటు చేసిన హైకోర్టు.. నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  

కీలక తీర్పు...

పరీక్షలు జరిపిన వైద్యుల కమిటీ.. పిండం వయస్సు 25 వారాలుగా తేల్చి కొన్ని జాగ్రత్తలతో నిపుణులు అబార్షన్ చేయవచ్చని సూచించింది. వివిధ అంశాలను పరిశీలించిన హైకోర్టు... బాలికకు అబార్షన్ (Abortion) చేయాలని ఆదేశించింది. చట్టం ప్రకారం 24 వారాలకు మించి వయసు ఉన్న పిండం తొలగింపునకు ఆదేశాలు ఇచ్చే అధికారం రాజ్యంగ కోర్టులకు ఉందని తెలిపింది. గర్భం కోరుకునే హక్కుతో పాటు చట్టపరిమితులకు లోబడి వద్దనుకునే హక్కు కూడా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దురదృష్ట ఘటనతో వచ్చిన అవాంఛనీయ గర్భాన్ని తొలగించకపోతే.. తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  

బాధితురాలి హక్కులే మిన్న...  

తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల పుట్టబోయే శిశువు ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చునని అభిప్రాయపడింది. పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని స్పష్టం చేసింది. హుందాగా, ఆత్మగౌరవంతో, ఆరోగ్యకరంగా జీవించే హక్కు మహిళలకు ఉందని పేర్కొంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు, నిపుణులతో గర్భవిచ్ఛితి (Abortion) ప్రక్రియ చేపట్టాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్​ను ఆదేశించింది. పిండం నుంచి రక్తం, కణజాలం, డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని తెలిపింది. ఫోరెన్సిక్ లేబొరేటరీ నివేదికలు వచ్చిన తర్వాత... కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు పంపించాలని తీర్పులో పేర్కొంది.

ఇదీ చూడండి: IT Raids on Hetero: హెటిరో సంస్థలపై ఐటీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం

Last Updated : Oct 8, 2021, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.