Agnipath Protest:అగ్నిపథ్‌ను నిరసిస్తూ యువకులు ఆందోళనతో సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లలో హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధానమైన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసి వేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.
మరోవైపు విజయవాడ రైల్వేస్టేషన్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎవరూ గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల రైల్వేస్టేషన్లలో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్తగా స్టేషన్ల వద్ద మోహరించారు.
సికింద్రాబాద్‌లో ఉద్రిక్తతతో కాచిగూడ స్టేషన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచాయి. ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్-ధన్‌పూర్, హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్‌కోస్ట్ రైళ్లు రద్దు కాగా... హైదరాబాద్‌లో 6 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు అయ్యాయి.