హైకోర్టులో మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్ - PROJECTS
ప్రభుత్వం ప్రాజెక్టులకై, అభివృద్ధిపనులకై రైతుల నుంచి చేపట్టే భూసేకరణ వల్ల నిర్వాసితులకు పునరావాసం అందడం లేదని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్డు... విచారణను జూన్‌కు వాయిదా వేసింది.
అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేపట్టే భూసేకరణ కారణంగా నిర్వాసితులయ్యేవారికి కల్పించే పునరావాస పథకం కంటి తుడుపు చర్యగా మిగలరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కాగితాల్లో పథకం ఘనంగా ఉండి ఆచరణలో కనిపించకపోతే ప్రయోజనం లేదని పేర్కొంది.
నిర్వాసితులు బాధితులవుతున్నారు...
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం భూసేకరణ చేపట్టారు. దానిలో నిర్వాసితులైన రైతులకు కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించలేదని పౌర హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రాంతాల్లో నిర్వాసితులకు పట్టాలు ఇచ్చామని అదనపు అడ్వకేట్ జనరల్ జె. రామచంద్రరావు వివరించారు. పునరావాస పథకానికి సంబంధించి ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని, నిర్వాసితులు బాధితులు కాకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.
8వేలకు 284 మందికి మాత్రమే...
ప్రభుత్వం చెబుతున్నదానికి, అమలుకు పొంతన లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. నిజనిర్ధరణ కమిటీ వెళ్లి పరిశీలిస్తే రైతల జీవితాలు, జీవనోపాధి దెబ్బతిన్నట్లు తేలిందన్నారు. ముత్తిరాసిపల్లిలో అధికారులు, బాధితుల వివరాల ప్రకారం 8 వేల మందికి గాను, కేవలం 284 మందికి మాత్రమే పునరావాస పథకం ప్రయోజనాలు అందినట్లు దృష్టికొచ్చిందన్నారు. న్యాయం చేయాలని కోరిన రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని... భూమిని స్వాధీనం చేసుకొని వారిని బలవంతంగా నిర్వాసితులను చేశారని వాదనలు వినిపించారు. పునరావాసం, పునర్నిర్మాణం పూర్తయ్యేదాకా పనులు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
జూన్‌కు వాయిదా వేసిన న్యాయస్థానం...
ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ తగిన ఆధారాలు, వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత ప్రభుత్వ శాఖకు నోటీస్ జారీ చేస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: శ్రమజీవుల స్వేచ్ఛాపథం... మేడే
contributor_akbar_wardhannapeta_division
9989964723
( )ప్రాదేశిక ఎన్నికల రెండో విడత బరిలో ఉన్న భాజపా అభ్యర్థులకు వరంగల్ గ్రామీణ జిల్లాలో భీ ఫామ్ లు అందించారు. జిల్లాలోని రాయపర్తి మండలం లో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెదగోని సోమయ్య గౌడ్ పలువురు అభ్యర్థులకు భీ ఫామ్ లు అందించారు. జడ్పీటీసీ అభ్యర్థిగా కర్ర శ్రీనివాస్ రెడ్డ్, పలువురు ఎంపీటీసీ లుగా బరిలో ఉన్నారు. భాజపా అభ్యర్థులను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. భాజపా అభ్యర్థులు గెలుపొందడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు గడ్డం నరేందర్, ప్రశాంత్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
01 పెదగోని సోమయ్య గౌడ్, భాజపా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.
Body:s
Conclusion:ss