ETV Bharat / state

HYD Rains: ముసురుపట్టిన భాగ్యనగరం.. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి! - Osman Sagar reservoir latest news

భాగ్యనగరం ఎడతెరపిలేని వానతో నానుతోంది. గత వారం రోజులుగా వర్షం ఏదో ఒక సమయంలో పడుతూనే ఉండగా.. రెండ్రోజులుగా రేయింబవళ్లు చిరు జల్లుల వాన నగరాన్ని వీడటం లేదు. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్‌ వాసులు వణుకుతున్నారు. గతేడాది వరద బీభత్సాన్ని గుర్తుకు తెచ్చుకుని బిక్కు బిక్కుమంటున్నారు.

ముసురుపట్టిన భాగ్యనగరం
ముసురుపట్టిన భాగ్యనగరం
author img

By

Published : Jul 22, 2021, 4:32 PM IST

Updated : Jul 22, 2021, 10:47 PM IST

రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో పరిస్థితి నానబెట్టినట్టుగానే ఉంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లోకి నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, నాలాలను సరిచేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.

భారీ వర్షంలో భాగ్యనగర వాసుల ఇక్కట్లు

గురువారం హైదరాబాద్‌లో 11.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 12.6, మేడ్చల్‌-మల్కాజ్‌గిరిలో 10.6, సంగారెడ్డి జిల్లాలో 8.7, వికారాబాద్‌లో 7.9 మిల్లీమటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పోలిస్తే మోస్తరు వర్షంతో నగరం తడిసిముద్దయింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మణికొండ, మెహదీపట్నం, నాంపల్లి, కోఠి, వనస్థలిపురం, హయత్‌నగర్‌, మేడ్చల్‌ తదితర ప్రాంతాలతో పాటు ఎల్బీనగర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల పరిధిలోనూ ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.

చర్యలు చేపడుతున్నజీహెచ్‌ఎంసీ సిబ్బంది

కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు

ముంపునకు గురైన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రధాన కూడళ్ల వద్ద వెంటనే స్పందించేందుకు డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నాలాలపై ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. భారీ వర్షపాతం నమోదైతే వెంటనే స్పందించేందుకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

వాగుల్లా మారిన రోడ్లపై వాహనదారుల ప్రయాణం

మేయర్ పర్యటన

ఎంఎస్‌ మక్తా, సోమాజీగూడ, రాజ్‌భవన్‌ పరిసర ప్రాంతాల్లోని బస్తీల్లో నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలిస్తున్నామని, సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర బృందాలను డివిజన్ల వారీగా సిద్ధం చేశామని మేయర్‌ తెలిపారు. నాగోల్‌, బండ్లగూడ, ప్రశాంత్‌నగర్‌, హస్తినాపురం, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, ముసారాంబాగ్‌ బ్రిడ్జి, పటేల్‌నగర్‌, ప్రేమ్‌ నగర్‌ కాలనీల్లో డ్రెయినేజ్‌లు ఉప్పొంగాయి. మరో వైపు హైదరాబాద్‌ నగర శివార్లలో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండాయి. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌సాగర్‌ ఎగువ ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదనీరు చేరుతోంది. దీంతో హిమాయత్‌ సాగర్‌ ఐదు గేట్లు, గండిపేట చెరువు రెండు గేట్లు ఎత్తి నీటిని మూసి నదిలోకి వదులుతున్నారు. అధికారులు మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

చార్మినార్‌ వద్ద గొడుగులతో ప్రజలు

జంట జలాశయాలకు జలకళ

మరోవైపు హైదరాబాద్ నగర శివార్లలో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్ (osman sagar and himayat sagar) ఎగువ ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదనీరు వస్తుండటంతో జలాశయాలు నిండుకున్నాయి.

చెరువులను తలపిస్తోన్న రోడ్లు

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. వరదను మూసీలోకి వదులుతున్నారు. మూసీ పరివాహకం లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. హిమాయత్‌సాగర్‌ 5 గేట్లు ఎత్తి 1,716 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్‌సాగర్‌ ఇన్‌ ఫ్లో 600 క్యూసెక్కులుగా ఉంది.

  • హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 1,763 అడుగులు
  • హిమాయత్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1762.60 అడుగులు
  • హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి సామ‌ర్థ్యం 2.968 టీఎంసీలు
  • హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుతం నీటి నిల్వ 2.716 టీఎంసీలు

ఉస్మాన్‌సాగర్‌ జలాశయానికి భారీగా వరద నీరు రావడంతో 2 గేట్లు ఎత్తారు. 200 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్‌ ఇన్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉంది.

ఉస్మాన్‌సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,790 అడుగులు

  • ఉస్మాన్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1,784.90 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.90 టీఎంసీలు
  • ఉస్మాన్‌సాగర్‌ ప్రస్తుత నీటి నిల్వ 2.817 టీఎంసీలు

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ల గేట్లు తెరిచిన నేపథ్యంలో చాదర్‌ఘాట్, శంకర్ నగర్, రసూల్‌పురా, ముసారాంబాగ్‌ ప్రాంతాల్లో మూసీ పరివాహక వాసుల ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మూసీ వరద ఉద్ధృతి పెరుగుతుండటం వల్ల ముందస్తుగా ఇళ్లు ఖాళీ చేసి... పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

వరుసగా రెండోసంవత్సరం జంట జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ నీటితో వచ్చే రెండేళ్ల వరకు నగరానికి నీటి సమస్య లేదని అధికారులు చెబుతున్నారు.

వాహనదారుల ఇక్కట్లు

ఇవీ చూడండి

Last Updated : Jul 22, 2021, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.