ETV Bharat / state

వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్ష సూచన - imd weather report of telangana

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 48గంటల్లో బలహీనమై వర్షాలు తగ్గుముఖం పడుతాయన్న వాతావరణ శాఖ గతేడాదితో పోలిస్తే ఈ వానాకాలంలో సగటు వర్షాపాతం 31శాతం ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించారు.

hesvy-rains-in-coming-48-hours-in-telangana
వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
author img

By

Published : Aug 16, 2020, 1:22 PM IST

Updated : Aug 16, 2020, 2:04 PM IST

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. తీవ్ర అల్పపీడనం...అల్పపీడనంగా మారిందని వచ్చే 48గంటల్లో బలహీనమై వర్షాలు తగ్గుముఖం పడుతాయన్నారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాపాతం ఎక్కువగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ సీజన్ లో ఇప్పటికే సాధారణం కన్నా 31శాతం అధికంగా నమోదైనట్లు వెల్లడించింది.

జిల్లా సాధారణం కన్నా వర్షం పెరుగుదల శాతం
వనపర్తి 124
జోగులాంబ గద్వాల 111
నిర్మల్ -23
వరంగల్​ అర్బన్108

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ అక్కడక్కడా చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం లేకపోలేదంది. రహదారులు కోతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీచూడండి: ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం

Last Updated : Aug 16, 2020, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.