ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న విద్యా దీవెన కార్డులో లక్ష్మి అనే విద్యార్థిని ఫొటోకు బదులుగా హీరో మహేష్‌బాబు చిత్రం రావడం చర్చనీయాంశమైంది. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన గంగమ్మ, సత్తన్నల కుమార్తె పరంపోగు లక్ష్మి.. స్థానికంగా ఉన్న సిద్దార్థ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదువుతోంది.
విద్యా దీవెన కింద ఆమెకు 2019-057-145-21 సంఖ్యతో గుర్తింపు కార్డు మంజూరు చేశారు. కార్డులో పేరు, చిరునామా సక్రమంగానే ఉన్నా.. యువతి చిత్రానికి బదులు హీరో మహేశ్‌బాబు ఫొటో ప్రచురితమైంది. కొన్ని కార్డుల్లో తప్పులు దొర్లాయని జిల్లా కమిషనర్ రఘనాథరెడ్డి వివరణ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'