ETV Bharat / state

Nandamuri Balakrishna: చెడును అంతం చేసి మంచి వైపు ప్రయాణమే సంక్రాంతి: బాలకృష్ణ - సంక్రాంతి పండుగ

Nandamuri Balakrishna Pongal Celebrations:ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కారంచేడుకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. తన సోదరి, ఎన్టీఆర్ కుమార్తె, భాజపా నాయకురాలయిన దగ్గుబాటి పురంధరేశ్వరి ఇంటికి... కుటుంబసభ్యులతో సహా కలిసి వచ్చారు.

Nandamuri Balakrishna Pongal Celebrations
పురంధరేశ్వరి ఇంటికి బాలయ్య కుటుంబం
author img

By

Published : Jan 14, 2022, 9:26 AM IST

Updated : Jan 14, 2022, 2:58 PM IST

Nandamuri Balakrishna Pongal Celebrations: చెడును అంతం చేసి మంచి వైపు మన ప్రయాణమే సంక్రాంతి అని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరి పురందేశ్వరి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో బాలకృష్ణ పాల్గొన్నారు.

Nandamuri Balakrishna Pongal Celebrations
పురంధరేశ్వరి ఇంటికి బాలయ్య కుటుంబం

సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని బాలకృష్ణ అన్నారు. చెమటోడ్చి పండించిన పంటలు ఇంటికి చేరే పండుగ.. రైతులు, రైతుకూలీలు, గ్రామీణులు, మహిళలు, యువత, అందరిలో ఆనందం నింపే పండుగ సంక్రాంతి అని తెలిపారు. క్రాంతి అంటే మార్పు.. సంక్రాంతి అంటే మంచిమార్పు అని అన్నారు.

భోగిమంటలు వేయడం, రంగవల్లులతో సంక్రాంతిని స్వాగతించడం, గ్రామీణ క్రీడలతో సంబురాలు జరుపుకోవడం, పెద్దలను స్మరించుకోవడం, రైతు నేస్తాలైన పశువులను పూజించడం అనాదిగా వస్తున్న మన సంప్రదాయమని గుర్తుచేశారు. అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి, సమాజ హితానికి ఈ సంక్రాంతి శుభకరం కావాలని, ఇంటింటా ఆనందాలను నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు బాలకృష్ణ తెలిపారు.

చెడును అంతం చేసి మంచి వైపు ప్రయాణమే సంక్రాంతి: బాలకృష్ణ

ఇదీ చదవండి: LIVE VIDEO: గుండెపోటుతో ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లాడు.. అక్కడే కుప్పకూలాడు!

Last Updated : Jan 14, 2022, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.