సంస్కృతి, సంప్రదాయాల (సుమేదసా - హెరిటేజ్ ఫెస్ట్) పోటీలను హరే కృష్ణ మువ్మెంట్ హైదరాబాద్లో నిర్వహించింది. జంట నగరాలతో పాటు మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి 22,971 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గెలుపొందిన విద్యార్థులకు రవీంద్రభారతిలో బహుమతుల ప్రదానం చేశారు. రేపటి తరాన్ని అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి హెరిటేజ్ ఫెస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు హరే కృష్ణ మువ్మెంట్ నిర్వాహకుడు సత్యగౌర చంద్ర దాస స్వామిజీ తెలిపారు.
భారతీయ సంప్రదాయాల పోటీల్లో భాగమైన జ్ఞానోదయం, సృజనాత్మకత, వినోదం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాలు, తెలివితేటలను వైదిక పద్ధతిలో ప్రదర్శిస్తూ ఆటపాటలతో చూపరులను మంత్రముగ్ధులను చేశారు.
ఇవీ చూడండి: పొలంలో కరెంట్ షాక్తో రైతు మృతి