ETV Bharat / state

ఆశ్రునయనాలతో అంత్యక్రియలు.. నిందితులను కఠినంగా శిక్షించాలి - ఆశ్రునయనాలతో అంత్యక్రియలు

పరువు హత్యకు గురైన హేమంత్‌ అంత్యక్రియలు కుటుంబ సభ్యుల కన్నీటి నివాళులతో ముగిశాయి. చందానగర్‌ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

hemanth Funeral with mourners they Accused persons severely punished
ఆశ్రునయనాలతో అంత్యక్రియలు.. నిందితులను కఠినంగా శిక్షించాలి
author img

By

Published : Sep 26, 2020, 4:24 PM IST

చందానగర్​లో హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి. లండన్‌లో ఉంటున్న అతని సోదరుడు హైదరాబాద్‌ వచ్చారు. ఇంటి దగ్గర హేమంత్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. భార్య, తల్లిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు.

ఆశ్రునయనాలతో అంత్యక్రియలు.. నిందితులను కఠినంగా శిక్షించాలి

పోలీసుల భద్రత మధ్య.. అంతిమయాత్ర సాగింది. బంధువులు, కాలనీవాసులు హాజరయ్యారు. శోకసంద్రంలో యాత్ర సాగింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబం వేడుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న హేమంత్​ను ఆయన మామ, కుటుంబసభ్యులు కిరాయి గుండాలతో కలిసి రెండురోజుల క్రితం దారుణంగా హత్యచేశారు. పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి : 'ఓట్లపై ఉన్న ప్రేమ.. హామీల విషయంలో లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.