ETV Bharat / state

హీరా గోల్డ్‌ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం

హీరా గోల్డ్‌ వ్యవహారంలో మదుపరుల నుంచి సేకరించిన 5వేల కోట్ల పెట్టుబడులపై హైదరాబాద్‌ సీసీఎస్​ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రచారం చేసిన సెలబ్రిటీలపై దృష్టి సారించారు. నౌహీరా షేక్‌ అరెస్టైన తర్వాత అయిదురుగు సంచాలకులు, ఇద్దరు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లారు.

హీరా గోల్డ్‌ వ్యవహారంలో దర్యప్తు వేగవంతం
author img

By

Published : Jun 29, 2019, 6:12 AM IST

Updated : Jun 29, 2019, 7:39 AM IST

ప్రచారం చేసిన సెలబ్రిటీలపై దృష్టి
హీరా గోల్డ్‌ వ్యవహారంలో మదుపరుల నుంచి సేకరించిన 5వేల కోట్ల పెట్టుబడులపై హైదరాబాద్‌ సీసీఎస్​ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఆ పెట్టుబడులు సంస్థ ఖాతాలకు కాకుండా ఎక్కడకు మళ్లాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. హీరాగోల్డ్‌కు ప్రచారం చేసిన సెలబ్రిటీలపై దృష్టి సారించారు.

హీరా గోల్డ్‌ వ్యవహారంలో దర్యప్తు వేగవంతం

ఆధారాలు లభిస్తే కఠిన చర్యలు
శాఖల విస్తరణలో భాగంగా.. నౌహీరా షేక్‌ ముంబయి, దిల్లీ, దుబాయి, అబుదాబీలో.. అయిదేళ్ల క్రితం కార్యాలయాల ప్రారంభోత్సవంలో ఇద్దరు బాలీవుడ్‌ కథానాయకులు, మాజీ క్రికెటర్‌, మరో క్రీడాకారిణి పాల్గొన్నట్టు గుర్తించారు. ప్రచారం చేసినందుకు డబ్బు తీసుకున్నారా, స్నేహపూర్వకంగా హాజరయ్యారా అనే అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ అయిదుగురిలో ఇద్దరికి... హీరాగోల్డ్‌ కంపెనీల్లో వాటాలున్నాయనే ప్రచారంపై విచారణ జరుపుతున్నారు. ముంబయి పోలీసులను సంప్రదించి సెలబ్రిటీలు ప్రచారం చేసినట్లు ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

సంచాలకులపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ
హీరా గోల్డ్‌ సంస్థల సంచాలకులపై సీసీఎస్​ పోలీసులు కొద్దిరోజుల క్రితం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి పరారయ్యే అవకాశాలున్నందున అన్ని విమానాశ్రయాలకు సమాచారమిచ్చారు. జలమార్గం ద్వారా విదేశాలకు వెళ్లేందుకు అవకాశముందన్న భావనతో ముంబయి, గోవా, విశాఖపట్నం ఓడరేవుల అధికారులకు... అధికారిక ఉత్తర్వులు పంపారు. నౌహీరా షేక్‌ అరెస్టైన తర్వాత అయిదురుగు సంచాలకులు, ఇద్దరు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లారు.

ఇవీ చూడండి: మానవత్వం లేని మగ మృగాలు

Intro:Tg_wgl_21_29_Gharana_Mosam_Pkg_Bite_3_TS10071

Body:ప్రజలు అపరిచితుల మాటలు నమ్మి మోసపోవద్దని

Conclusion:
Last Updated : Jun 29, 2019, 7:39 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.