ఆగని ఆఖరి దోపిడీ అని ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. కొవిడ్ మరణ మృదంగం కొనసాగుతోంది. ప్రైవేట్ అంబులెన్స్ ల నుంచి శ్మశానాల నిర్వాహకుల వరకు అందరూ కరోనా మృతుల బంధువుల్ని పీక్కుతింటున్నారు. రోగిని దహనం చేయడానికి వేలల్లో రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ చర్యల్ని అరికట్టడానికి దహనానికి అయ్యే ధరల్ని నిర్ధరిస్తూ జీహెచ్ఎంసీ ఇప్పటికీ ఓ ప్రకటన ఇవ్వకపోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయని కథనంలో ఉంది. తక్షణమే ఈ ఘటనపై వివరణ జరిపించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 25 లోపు సమగ్ర నివేదికను కమిషన్ కు సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హెచ్చార్సీ ఆదేశించింది.