రాష్ట్రంలో ఈ రోజు, రేపు భారీ(HEAVY RAINS) నుంచి అతి భారీ, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు(VERY HEAVY RAINS) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HYDERABAD METEOROLOGICAL DEPARTMENT) ప్రకటించింది. ఉత్తర పరిసర మధ్య బంగాళాఖాతంలో రాగల 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు.. ఓ ప్రకటనలో వెల్లడించారు. రుతుపవనాల ద్రోణి ఈ రోజు ఇస్సార్, దిల్లీ, సిధి, బాలంగీర్, కళింగపట్నం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని వివరించారు.
నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టం నుంచి 4.5 కి.మీ వరకు కేంద్రీకృతమై ఉందని సంచాలకులు చెప్పారు. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు.
ఇదీ చదవండి: Rain Effect : ఉప్పొంగుతున్న వాగులు.. దాటారంటే అంతే సంగతులు