ETV Bharat / state

సందర్శకులతో కిటకిటలాడిన నుమాయిష్​ - సందర్శకులతో కిటకిటలాడిన నుమాయిష్​

ఏటా నగరవాసులను అలరించే హైదరాబాద్ నుమాయిష్ సందడి మొదలైంది. జనవరి 1న ప్రారంభమైన నాంపల్లి ఎగ్జిబిషన్​కు రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ప్రారంభమైన తొలి ఆదివారం కావటం వల్ల పెద్దసంఖ్యలో నగరవాసులు నుమాయిష్​కు తరలి రావటంతో ఎగ్జిబిషన్ పరిసరాలన్నీ సందర్శకులతో కిటకిటలాడాయి.

heavy rush in numaish in hyderabad
సందర్శకులతో కిటకిటలాడిన నుమాయిష్​
author img

By

Published : Jan 6, 2020, 3:59 AM IST

సందర్శకులతో కిటకిటలాడిన నుమాయిష్​

హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో 45 రోజుల పాటు నగరవాసులను అలరించేందుకు నుమాయిష్ ప్రారంభమైంది. ప్రారంభమై ఐదో రోజు కావటం వల్ల రెట్టింపు సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. తొలి నాలుగు రోజుల్లో సగటున 15 వేల మంది నుమాయిష్​ను సందర్శించగా... ఆదివారం రెట్టింపు సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు 70 శాతం స్టాళ్లు పూర్తయ్యాయని.. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయి స్టాళ్లు అందుబాటులో ఉంటాయని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్ తెలిపారు. సందర్శకుల కోసం ఫ్రీ పార్కింగ్ కల్పించామని.. పార్కింగ్​కు ఎవరూ డబ్బులు చెల్లించొద్దని పేర్కొన్నారు. మరిన్ని పార్కింగ్ సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది అగ్నిప్రమాదం బాధాకరమని.. ఈసారి అన్ని భద్రత చర్యలు తీసుకున్నామని.. సేఫ్ అండ్ హ్యాపీ నుమాయిష్ ప్రజలు ఆస్వాదించాలని ఆయన కోరారు.

ప్రత్యేక ఏర్పాట్లు

గతేడాది చేదు అనుభవాలు దృష్ట్యా ప్రతీ స్టాల్ వద్ద అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేశారు. ఫైర్ ఇంజన్, సుశిక్షితులైన ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. స్టాళ్ల సంఖ్యను తగ్గించి మరీ.. సందర్శకులు నడిచేందుకు ఫ్రీ స్పేస్ కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటపడేందుకు నిష్క్రమణ గేట్లను పెంచారు. 2 వేలకు పైగా ఉన్న స్టాళ్ల వివరాలు తెలిపేలా సూచిక బోర్డులు, గైడ్​లను ప్రత్యేకంగా నియమించారు. ఎగ్జిబిషన్​ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తామని.. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన సౌకర్యాలు కలుగజేశారని సందర్శకులు అభిప్రాయపడ్డారు.

హర్షం వ్యక్తం చేస్తున్న వ్యాపారులు

రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరగటం ఆనందానిస్తోందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. స్టాళ్ల సంఖ్య తగ్గించినా.. ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన కొనుగోళ్లను పెంచుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: 'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

TG_HYD_12_06_NUMAYISH_RUSH_PKG_3181965 REPORTER : PRAVEEN CAMERA : RAMANA ( ) ఏటా నగరవాసులను అలరించే హైదరాబాద్ నుమాయిష్ సందడి మొదలైంది. జనవరి ఒకటవ తేదీన ప్రారంభమైన నాంపల్లి ఎక్సబిషన్ కు రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఎక్సబిషన్ ప్రారంభమైన తొలి ఆదివారం కావటంతో పెద్దసంఖ్యలో నగరవాసులు నుమాయిష్ కి తరలి రావటంతో ఎక్సబిషన్ పరిసరాలు అన్నీ సందర్శకులతో కిటకిటలాడాయి. Look V.O : హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సబిషన్ మైదానంలో 45 రోజుల పాటు నగరవాసులను అలరించేందుకు నుమాయిష్ ప్రారంభమైంది. ప్రారంభమై ఐదో రోజు కావటంతో రెట్టింపు సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. తొలి నాలుగు రోజుల్లో సగటున 15 వేల మంది నుమాయిష్ ను సందర్శించగా ఆదివారం రెట్టింపు సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు 70 శాతం స్టాళ్లు పూర్తయ్యాయని.. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయి స్టాళ్లు అందుబాటులో ఉంటాయని ఎక్సబిషన్ సొసైటీ కార్యదర్శి ప్రభా శంకర్ తెలిపారు. సందర్శకుల కోసం ఫ్రీ పార్కింగ్ కల్పించామని.. పార్కింగ్ కు ఎవరూ డబ్బులు చెల్లించొద్దని పేర్కొన్నారు. మరిన్ని పార్కింగ్ సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది అగ్నిప్రమాదం బాధాకరమని.. ఈసారి అని భద్రత చర్యలు తీసుకున్నామని.. సేఫ్ అండ్ హ్యాపీ నుమాయిష్ ప్రజలు ఆస్వాదించాలని ఆయన కోరారు. Byte ప్రభా శంకర్, ఎక్సభిషన్ సొసైటీ కార్యదర్శి V.O : గతేడాది చేదు అనుభవాలు దృష్ట్యా ఈసారి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు. ప్రతీ స్టాల్ వద్ద అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేశారు. ఫైర్ ఇంజన్, సుశిక్షితులైన ఫైర్ సిబ్బంది అందుబాటులో ఉంచారు. స్టాళ్ల సంఖ్యను తగ్గించి మరీ.. సందర్శకులు నడిచేందుకు ఫ్రీ స్పేస్ కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటపడేందుకు నిష్క్రమణ గేట్లను పెంచారు. 2 వేలకు పైగా ఉన్న స్టాళ్ల వివరాలు తెలిపేలా సూచిక బోర్డులు, గైడ్ లను ప్రత్యేకంగా నియమించారు. Spot V. O : ఎక్సభిషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తామని.. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన సౌకర్యాలు కలుగజేశారని సందర్శకులు అభిప్రాయపడ్డారు. నుమాయిష్ చేరుకోవటానికి మెట్రో కనెక్టివిటీ బాగుందని.. ఎక్సబిషన్ పరిసరాల్లో ద్విచక్రవాహన పార్కింగ్ ఇబ్బంది కలిగిస్తోందని.. పార్కింగ్ సదుపాయాలు పెంచాలని వారు కోరారు. ఎక్సబిషన్ సొసైటీ తీసుకున్న భద్రత చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.Voxpop సందర్శకులు V.O : రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరగటం ఆనందానిస్తోందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. స్టాళ్ల సంఖ్య తగ్గించినా.. ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన కొనుగోళ్లు పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Voxpop స్టాల్ నిర్వాహకులు End with PTC
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.