ETV Bharat / state

ప్రజలతో కిటకిటలాడిన మాదన్నపేట్ మార్కెట్ - తెలంగాణ వార్తలు

లాక్ డౌన్ సడలింపు సమయంలో పాతబస్తీలోని మాదన్నపేట్ మార్కెట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడం వల్ల కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలు కోసం జనాలు పెద్దఎత్తున మార్కెట్​కు తరలివచ్చారు.

market
market
author img

By

Published : May 23, 2021, 1:09 PM IST

హైదరాబాద్ పాతబస్తీలోని మాదన్నపేట మార్కెట్‌ కిటకిటలాడింది. ఆదివారం కావడం వల్ల కూరగాయలు, ఇతర వంట సరుకుల కొనుగోలు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలివచ్చారు. సమీప ప్రాంత ప్రజలంతా ఉదయం 6 గంటల నుంచే మాదన్నపేట మార్కెట్‌ బాటపట్టారు.

మాస్కులు ధరించినప్పటికీ భౌతిక దూరం పాటించకుండానే గుమిగూడారు. కొనుగోలుదారులతో కూరగాయల మార్కెట్‌ కిక్కిరిసిపోయింది. సరూర్ నగర్ పోలీసులు కర్మన్ ఘట్​లో చెక్ పోస్ట్ పెట్టి తనిఖీలు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.